ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ముగ్గురు మంత్రులను తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధీకి కేబినెట్ లో చోటు కల్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో పడేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు రాహుల్. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.
తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు పై కృష్ణామోహన్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్వపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణామోహన్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. తప్పుడు అఫిడవిట్ చూపించి తన పైన అనర్హత వేటు అంటూ ప్రచారం చేశారని కృష్ణామోహన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఉందని. కేసీఆర్ పార్టీలగా నియంతృత్వ పార్టీ కాదు అని విమర్శించారు.
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ IMA ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్ రావు, పలువురు డాక్టర్లు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలా.. లేదా రాంగ్(wrong) లీడర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని ఆయన పేర్కొన్నారు.