Yoga: ఈ యోగాసనాలు చేసారంటే ఇక ఆ జబ్బులు రావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో చాలామంది హృద్రోగాల బారిన పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఇటీవలే గుండె సంబంధిత జబ్బులపై కేంద్రం కూడా అలర్ట్ చేసింది. దేశంలో యువత ఎక్కువగా గుండె జబ్బులతో చనిపోతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అయితే గుండె జబ్బులు రావడానికి కారణం మానసిక, శారీరక ఒత్తిడితో పాటు అస్తవ్యస్తమైన జీవన విధానం, రోజూ తీసుకునే ఆహారం సహా పలు అంశాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. యోగా చేస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని చెబుతుండగా.. ముఖ్యంగా మూడు యోగాసనాలు రోజూ వేయడం ద్వారా గుండె జబ్బుల బారినపడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఆ యోగాసానాలు ఏంటంటే.. ఉత్థిత త్రికోణాసనం, పశ్చిమోత్తానాసనం, అర్ధ మత్య్సేంద్రాసనం.
Amit Sha: తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ఉత్థిత త్రికోణాసనం ఎలా వేయాలంటే.. నేలపై నిటారుగా నిలబడి కాళ్లను కొద్దిగా ఎడంగా చాపాలి. కుడికాలిని మరింత దూరం జరిపి పాదాన్ని కుడిచేతితో అందుకోవాలి. ఎడమ చేతిని నిట్టనిలువుగా పైకి లేపి ఉంచాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి ఆపై సాధారణ స్థితికి రావాలి. అనంతరం మళ్లీ ఎడమ కాలితో ఇదేవిధంగా చేయాలి. ఇలా రోజూ నాలుగైదు సార్లు చేస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Chandrayaan-3: తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రత వివరాలు పంపిన విక్రమ్
పశ్చిమోత్తానాసనం వేసే విధానం.. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి.. తర్వాత ముందుకు వంగి పాదాలను పట్టుకోవాలి. తలను పూర్తిగా కిందికి వంచి కాళ్లపై ఆనించాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి పైకి లేవాలి. ఈ ఆసనం కూడా రోజూ నాలుగైదు సార్లు వేయాలి.
NTR: తారక్ మాటే నా మాట అంటున్న బాలయ్య..
అర్ధ మత్య్సేంద్రాసనం వేసే విధానం.. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఎడమకాలిని తీసి కుడికాలి మీదుగా వేసి.. ఎడమకాలి పాదం కుడికాలి మోకాలికి అవతలివైపు వచ్చేలా వేయాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమ మోకాలిని కుడివైపుకు వంచినట్లు ఉంచాలి. తలను ఎడమ భుజం వైపు తిప్పి చూడాలి. ఎడమ చేతిని నేలపై ఆనించి వీపు నుంచి దూరంగా జరపాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండి సాధారణస్థితికి రావాలి. ఆపై కుడివైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా ఈ మూడు ఆసనాలు చేయడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!