JP Nadda: కాంగ్రెస్ అంటే దోపిడి, కాంగ్రెస్ అంటే అవినీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రాజస్థాన్‌లో ‘పరివర్తన్ సంకల్ప యాత్ర’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి భారతదేశం (I.N.D.I.A), కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కూటమికి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంపైనే ఆందోళన అని విమర్శించారు. లాలూకి తేజస్విపై ఆందోళన, సోనియాకు రాహుల్‌పై ఆందోళన, అఖిలేష్‌కు డింపుల్‌పై ఆందోళన, ఉద్ధవ్ కు ఆదిత్యపై ఆందోళన, మమతకు ఆమె మేనల్లుడుపై ఆందోళన అని కామెంట్స్ చేశారు.
Read Also: CJI: చాలా దేశాల్లో సమస్యలు ఆయుధాలతో పరిష్కారమవుతాయి.. భారత సంస్కృతిపై సీజేఐ ఏమన్నారంటే?
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని నడ్డా ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించరని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను సంతోష పెట్టడంలో కాదు.. దోచుకోవడంలో నిమగ్నమై ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లో ఆడబిడ్డలకు భద్రత లేదని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందని.., ఆ డబ్బును ఢిల్లీకి పంపి ఆ పార్టీ అధినేతల జేబులు నింపుతోందని నడ్డా మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడి, కాంగ్రెస్ అంటే అవినీతి, అలాంటి ప్రభుత్వాన్ని బతకనివ్వద్దని అన్నారు. కాంగ్రెస్ అంటే రెడ్ డైరీ.. ఆ రెడ్ డైరీలో ఏముంది.. రాజస్థాన్‌లోని ఆడబిడ్డలపై అత్యాచారాలు, నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇతరులకు రక్షణగా పేరుగాంచిన రాజస్థాన్ ఈరోజు సురక్షితంగా లేదని నడ్డా పేర్కొ్న్నారు.
- Tags
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!