Amit Shah: గిరిజనుల భూములపై కాంగ్రెస్ కన్ను పడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని ‘ఆరోప్ పత్ర’ పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు. అంతే కాకుండా.. భూపేష్ బఘెల్ ప్రభుత్వం అవినీతిమయమైందని మండిపడ్డారు.
Polyhouse Rose Cultivation: పాలిహౌస్ గులాబి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Also Read
ఛత్తీస్‌గఢ్‌ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామని గిరిజన సోదరులకు చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను సుందరంగా తీర్చిదిద్దే పని రమణ్‌సింగ్ చేశారని.. 32 శాతం రిజర్వేషన్లు కల్పించారని రమణ్‌సింగ్ అన్నారు. ఆశలు, నమ్మకాలను వమ్ము చేసి.. రాష్ట్రంలోని కోట్లాది మంది కష్టాన్ని తమ ఢిల్లీ కోర్టులో నింపుకోవడానికి రాష్ట్రాన్ని అవినీతికి కోటగా మార్చారని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.
India vs Pakistan LIVE Score, Asia Cup 2023: 100 దాటిన భారత్ స్కోరు.. 4 డౌన్
రాష్ట్రంలో రైతులు, గిరిజన సోదరులు, సోదరీమణులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని అమిత్ షా తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి అవినీతిని, నల్ల కుబేరులను ప్రజల ముందుకు తీసుకువస్తామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులకు 2 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే పనిని బీజేపీ చేసిందని.. మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇంటింటికీ బియ్యం పంపిణీ చేశారని తెలిపారు. బొగ్గు, మద్యం, ఆన్‌లైన్ బెట్టింగులతో కాంగ్రెస్.. రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అమిత్ షా అన్నారు. గతంలో గిరిజనుల కోసం 24 వేల కోట్ల నిధులు ఉండేవని.. దానిని ప్రధాని మోడీ 1 లక్షా 19 వేల కోట్లకు పెంచారని అమిత్ షా చెప్పారు. ఇప్పుడు గిరిజనుల భూములపై కాంగ్రెస్ కన్ను పడిందని ఆరోపించారు.
Rahul Gandhi: బీజేపీ ఆదివాసీలను అటవీవాసులుగా పిలుస్తోంది
ఛత్తీస్‌గఢ్‌లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!