Chandrayaan-3: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు.. కీలక విషయాలు బయటపెట్టిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. అంతేకాకుండా మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే తాను సేకరించిన విషయాలన్నింటినీ ఇస్రోకు పంపిస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అక్కడి వాతావరణం ఎలా ఉందన్న విషయాలకు చెందిన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. తాజాగా.. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నాయని కనుగొన్నది. అలాగే చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తింంచినట్లు తెలిపింది. వీటితో పాటు ఇంకొన్ని ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ట్విట్టర్ వేదికగా తెలిపింది.
Read Also: Mallikarjun Kharge: గ్యాస్ ధర తగ్గింపుపై విమర్శలు.. ఎన్నికల లాలీపాప్గా అభివర్ణించిన ఖర్గే
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O)ను కూడా కనుగొన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ పేర్కొంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్ రోవర్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఆ పరికరమే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాలను గుర్తించింది. హైడ్రోజన్ కోసం కూడా శోధన కొనసాగుతుందని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రజ్ఞాస్ రోవర్‌లో అమర్చిన లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డెవలప్ చేసిందని తెలిపింది.
Read Also: Kalki 2898AD: బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి ..?
దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో పంచుకుంది. జాబిల్లి ఉపరితలంపై 50.5 డిగ్రీల సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే.. 80 మి.మీల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్‌లోని పేలోడ్ చాస్టే గుర్తించింది. ల్యాండింగ్ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు 20- 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Chandrayaan-3 Mission:
In-situ scientific experiments continue …..
Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL
— ISRO (@isro) August 29, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!