శరీర శక్తి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఖర్జూరంతో శెనగపప్పు కలుపుకుని తినండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 5న ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్‌లో షర్మిల ఏ స్థానానైనా అడగొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్ లేదు కదా అంటూ సెటైర్లు వేశారు. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెప్పాలన్నారు.
మనం ఎక్కువగా కూరల్లో వాడే కూరగాయ టమాటా. ఇది లేనిది ఏ కూర వండరు. అంతేకాకుండా దీన్ని ఇతర కూరగాయల వంటల్లో వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అందుకే టమాటాను ప్రతి ఒక్క కూరల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని.. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు.
బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.