గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. బైకులు, బస్సులు, కార్లు, చివరకు రైళ్లలో కూడా గంజాయిని అక్రమంగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా ఎదురెళ్తున్నారు. ఈ క్రమంలో.. చేరాల్సిన సమయానికి సరుకు చేరితే దొరల్లాగా తిరుగుతున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే కటకటాలు లెక్కించాల్సిందే.. ఏదేమైనాప్పటికీ ఏదో విధంగా అక్రమ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. వివరాల్లోకి వెళ్తే….
Read Also: Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు
కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని అన్నారు. వారి వద్ద నుండి కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు మీడియా సంస్థ పేరు కారుకు స్టిక్కర్ అంటించుకుని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. ఇంతకుముందు ఒకసారి ఇలాగే కేరళ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.
Read Also: Baba Ramdev : వందల టన్నుల కారం పొడిని రిటర్న్ ఇవ్వమన్న బాబా రాందేవ్ కంపెనీ.. డబ్బులు వాపస్