డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది అని అన్నారు.
వరంగల్ జిల్లా మామునూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలు, ఒక కారుపై ఇనుప స్తంభాల పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007లో గెలుపొందారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభించనున్నారు.