నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
పలువురు క్రీడాకారులకు పద్మ అవార్డులు దక్కాయి. భారత మాజీ హాకీ గోల్‌కీపర్ PR శ్రీజేష్‌కు పద్మభూషణ్.. ఆర్ అశ్విన్, ఫుట్‌బాల్ లెజెండ్ IM విజయన్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అంతేకాకుండా.. హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్‌లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటు అవుతున్నాయి.. సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల్లో పర్యటనలను టీంలు మానిటరింగ్ చేస్తాయి. అందుకోసం జోన్ల వారీగా అధికారుల నియామకం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.