రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలను తెలంగాణ సర్కార్ లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నాలుగు పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి నలుగురు మండలస్థాయి అధికారులను నియమించాలని తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31 లోపు నాలుగు పథకాలు వంద శాతం అమలు జరిగేలా చూడాలి.. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు.. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.
RGV : వెంకటేష్ తో వర్మ ‘సిండికేట్’.. సర్కార్ కూడా?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తామని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా… ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండని అన్నారు. బీపీఎల్ కుటుంబాలందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారు.. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇకపై బయట ఆహార పదార్థాలు కొనుక్కోవాల్సి ఉండదని అనుకుంటున్నానన్నారు.
Hydra: హైడ్రా చర్యలకు హర్షం వ్యక్తం చేసిన దివ్యానగర్ వాసులు.. ఎందుకంటే?
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారతదేశంలో రికార్డు స్థాయిలో పంటలు పండించింది తెలంగాణ రైతాంగం అని అన్నారు. దేశంలోనే రూ.7525 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. 21వేల కోట్ల రైతు రుణమాఫీ, 3వేల కోట్ల రైతు భీమా కట్టామని తెలిపారు. రేపట్నుంచి రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని రైతు భరోసా అమలు చేయబోతున్నామని అన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికీ రైతు భరోసా ఇస్తున్నాం.. 40 వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.