జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే.. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా.. పార్టీలో సంస్ధాగతంగా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ ప్లీనరీ సమావేశాల నుంచి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Nara Bhuvaneshwari: ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్..
6 నెలల పాలన వలన జనసేనకు ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ప్లీనరీలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు నేతలు.. ఇప్పటికే ప్లీనరీ నిర్వహణకు పిఠాపురం నియోజకవర్గంలో స్ధలం పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న జనసేన ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ సంస్ధాగత అంశాలపై నిర్ణయాలకు ప్లీనరీ సమావేశం వేదిక కానుంది.
Read Also: Mumbai: మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! విచారణలో షాకింగ్ విషయాలు