Rishabh Pant: టీమిండియా స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ పంత్.. మోకాలి లిగమెంట్లు డ్యామేజ్ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ప్రమాదం వల్ల రిషబ్ పంత్.. ఐపీఎల్, ఆసియా కప్ టోర్నమెంట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
Read Also: Asia Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
రిషబ్ పంత్ సర్జరీ తర్వాత కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. శిక్షణ తర్వాత ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్న పంత్.. ఫిట్ నెస్ ఒక్కటి సాధిస్తే మునుపటి ఫామ్ ను తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే రిషబ్ పంత్ ఎన్సీఏ(NCA)లో తాను శిక్షణ పొందుతున్న వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘సొరంగం చివర కనీసం వెలుగు చూడడం మొదలైనందుకు దేవుడికి ధన్యవాదాలు’’అంటూ తన స్పందన తెలియజేశాడు.
Read Also: Apple Watch: మరోసారి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
మొన్నటిదాకా రిషబ్ తో పాటు శిక్షణ తీసుకున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి టీంలోకి చేరారు. ఆసియాకప్ లో జరుగుతున్న మ్యాచ్ లలో శ్రేయాస్.. పునరాగమనం చేయగా కేఎల్ రాహుల్ కి కొంత సమయం ఇచ్చారు. వన్డే ప్రపంచకప్ వరకు పంత్ ఫిట్ నెస్ సాధిస్తాడో లేదో చూడాలి మరి.