బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో రాజ్యాంగ ప్రవేశిక వ్రాయబడింది. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు. చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. పాట్నా యూనివర్సిటీలో సన్మాన కార్యక్రమానికి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. 'దేశ ప్రధాని ఎలా ఉండాలి, నితీష్ కుమార్ లా ఉండాలి' అంటూ కొందరు విద్యార్థులు నినాదాలు చేశారు.
ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో పర్యటించనున్నారు. జకార్తాలో జరుగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
జీ-20 విందులో రాష్ట్రపతిని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అని రాయకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.