Renuka Chaudhary: షర్మిల పాలేరు టికెట్ అడగడానికి ఏముంది.. రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లకు తెలంగాణ కోడలు అని గుర్తొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే.. నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను అన్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలపై తన అభిప్రాయం కూడా కీలకమేనని చెప్పుకున్నారు. నాకు ఆంధ్రలో ఎంత హక్కు ఉందో.. ఇక్కడ షర్మిలకూ అంతేనన్నారు. అసలు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు షర్మిల ఒక్కరేనా.. ఇంకా ఎవరైనా మిగిలారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల ఏ స్థానానైనా అడగొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్ లేదు కదా అంటూ సెటైర్లు వేశారు. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెప్పాలన్నారు.
Read Also: Tomato: టమాటాలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
- AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిశారంతే అన్న రేణుకా చౌదరి.. వాళ్లు ఇంకా ఏం చెప్పలేదన్నారు. షర్మిల తెలంగాణలో పోటీచేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. అయితే విలీనాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తుంది. ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? అంటూ సూటిగా ప్రశ్నించారు. షర్మిల ముందుగా అమరావతి రైతుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!