రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ-20 సదస్సు విందుకు భారత రాష్ట్రపతి పేరిట పంపిన ఆహ్వానంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మారుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు. ప్రపంచానికి 'ఇండియా' అనే పేరు తెలుసని.. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం దేశం పేరు మార్చాల్సే అవసరం ఏమొచ్చిందని అన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ "విఐపి ట్రీట్‌మెంట్" ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
మొలకెత్తిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకెత్తే ప్రక్రియ గ్రాములో పోషకాలు మరియు విటమిన్ల మొత్తాన్ని పెంచుతుంది. మొలకెత్తిన శెనగలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయి.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నప్పటి నుండి క్లాస్‌మేట్స్ కావడంతో ముగ్గురూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఆ క్లోజ్‌నెస్‌కు లవ్ అని పేరు పెట్టేసిన శివకుమార్.. సంఘవికి తన మనసులోని మాట చెప్పాడు. చిన్ననాటి స్నేహితులం కదా అని చనువిస్తే.. ఇదేం పద్దతి అంటూ పృథ్వి, సంఘవి శివకుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. "తమిళనాడు ప్రజలను, సీఎం ఎంకె స్టాలిన్‌ను తాను చాలా గౌరవిస్తానని మమతా బెనర్జీ తెలిపింది. ప్రతి మతానికి భిన్నమైన భావాలు ఉంటాయన్నారు. భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వం' అని ఒక వర్గానికి హాని కలిగించే ఏ విషయంలోనూ తాము జోక్యం చేసుకోమన్నారు.
2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆసియా కప్‌లో కామెంటరీ చేస్తున్న గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు.
కేరళలోని కొట్టాయం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి మృగంగా మారాడు. మానసిక ఒత్తిడితో మొదట తన ముగ్గురు కూతుళ్లను గొంతు కోసి చంపాలని ప్రయత్నించి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా.. ఓ జవాన్ గాయపడ్డాడు.
సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు. కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.