బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గొర్రెలు అడ్డురావడంతో ముందు వెళ్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. దీంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఈటల రాజేందర్ ప్రయాణం చేస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటల ప్రయాణించే కారు.. స్వల్పంగా దెబ్బతిన్నది. కారులోని ఈటలతో సహా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఆయన మరో వాహనంలో హైదరాబాద్ కు వెళ్లారు.