ఆసియా కప్లో భాగంగా నేపాల్తో జరిగే మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకలెలో జరుగుతుంది. ఆసియా కప్ లో తొలి మ్యా్చ్ లో పాకిస్తాన్ తో తలపడిన టీమిండియా.. ఫలితం తేలకుండానే ‘డ్రా’ గా ముగిసింది.
Read Also: Ghosi Bypoll: బీజేపీ vs ఇండియా.. కూటముల మధ్య తొలిపోరు..
అయితే ఈ మ్యాచ్ లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చాడు. దీంతో అతని స్థానంలో మహ్మద్ షమీని టీంలోకి తీసుకున్నారు. ఈ ఒక్క మార్పు మినహా పాక్ తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నారు.
Read Also: Raviteja: ఎక్ ధమ్ నచ్చేసావే అంటూ ప్రేమలు పాఠాలు చెప్తున్న గజదొంగ
భారత తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
నేపాల్ తుది జట్టు
కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి