ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు. చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో తీవ్ర దు:ఖంతో బాలుడి తండ్రి.. తన కొడుకు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అభం శుభం తెలియని తన కొడుకు ఆ కుక్క బలితీసుకుందని.. దాన్ని పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Akkineni Naga Chaitanya: చై- శోభితా.. మళ్లీ అడ్డంగా దొరికేశారే ..?
విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో యాకూబ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. యాకూబ్ కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఎనిమిదో తరగతి చదువుతున్న అతని కుమారుడు చావెజ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీళ్లను చూస్తే తెగ భయపడిపోయేవాడు. అంతేకాకుండా ఆ బాలుడు.. తినడం, త్రాగడం కూడా మానేశాడు. కొన్నిసార్లు కుక్క మొరిగినట్లుగా శబ్దాలు చేసేది.
Prabhas: ప్రభాస్ కి ఇష్టమైన రొయ్యల పలావ్ రెసిపీ ఇదే.. ఇక చరణ్ వంతు!
అయితే చావెజ్ పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురయ్యాడని గుర్తించారు. కుక్క కాటు వల్ల ఇన్ఫెక్షన్ అతని శరీరమంతా వ్యాపించిందని తెలిపారు. ఆ కారణంగా బాలుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులు చావెజ్‌ను ప్రశ్నించగా.. నెలన్నర క్రితం కుక్క కరిచిందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు తనను కొడతారనే భయంతో కుక్క కరిచిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
Anushka Shetty : తన పెళ్లి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన అనుష్క..
ఈ విషయాన్ని విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కుక్క కాటుకు గురయ్యానని చెబితే.. సకాలంలో వైద్యం చేసి ఉండేవాళ్లమని చెప్పారు. దీంతో సెప్టెంబరు 1 నుండి కుటుంబ సభ్యులు బాలుడిని ఇతర వైద్యులకు చూపించారు. ఎక్కడికి వెళ్లినా వైద్యం చేయలేకపోతున్నారు. అయితే కుక్కకాటుకు చికిత్స చేసే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడికి చూపెట్టిన తర్వాత.. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో తండ్రి ఒడిలో బాలుడు చావెజ్ చనిపోయాడు. దీంతో తన బిడ్డను అలాంటి పరిస్థితిలో చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.