Viral: కొత్తగా పెళ్లైన జంట.. బస్టాండ్‌లో భర్తను పకోడి తెమ్మని చెప్పి పరారైన భార్య..
- పకోడి తెచ్చేలోపే పరారైన భార్య..
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘటన..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పకోడీలు కావాలని భర్తను షాపుకు పంపిన ఓ నవవధువు.. అతడు తిరిగి వచ్చేలోపే బస్టాండ్ నుంచి మాయమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వింత మిస్టరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది..?
రాంపూర్ జిల్లాకు చెందిన రిమ్జిమ్ (18) అనే యువతికి అమ్రోహా జిల్లాకు చెందిన పీతమ్ సింగ్‌తో 2025, డిసెంబర్ 1న వివాహం జరిగింది. పెళ్లై మూడు నెలలు కూడా గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. హోలీ పండుగ కోసం వారం రోజుల క్రితం రిమ్జిమ్ పుట్టింటికి వెళ్లింది. పండుగ అయిపోయాక.. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి పీతమ్ సింగ్ సోమవారం (మార్చి 9) ఆమె గ్రామానికి వెళ్ళాడు.
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వీరిద్దరూ కలిసి మొరాదాబాద్ వెళ్లేందుకు బిలారీ బస్టాండ్‌లో రోడ్‌వేస్ బస్సు ఎక్కారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బస్సు ఓ బస్టాండ్‌లో ఆగింది. ఆ సమయంలో తనకు పకోడీలు తినాలని ఉందని, దాహం వేస్తోందని భర్తతో రిమ్జిమ్ చెప్పింది. భార్య కోరిక మేరకు పీతమ్ సింగ్ పక్కనే ఉన్న క్యాంటీన్‌కు పకోడీలు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు.
Also Read:TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..
తిరిగి వచ్చేసరికి ఖాళీ సీటు
కొద్దిసేపటి తర్వాత పీతమ్ సింగ్ పకోడీలతో బస్సు దగ్గరకు వచ్చి చూసేసరికి, సీట్లో ఉండాల్సిన భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. ఆమె ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. బస్సులోని ఇతర ప్రయాణికులను అడగగా.. ఆమె ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగి వెళ్లిపోయిందని వారు చెప్పారు.
Also Read:Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
పోలీసులకు ఫిర్యాదు..
చాలాసేపు బస్టాండ్ అంతా వెతికిన పీతమ్ సింగ్, చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తితో వెళ్లిపోయి ఉండవచ్చని అతను తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. రిమ్జిమ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుందని.. ఆమె ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటుందని వివరించాడు.
తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఆమె ఇలా చేస్తుందని తాము అస్సలు ఊహించలేదని భర్త తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ వినీత్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ఆ నవవధువు కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!