Meeting: సోనియా నివాసంలో కీలక భేటీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా.. భారత్‌గా పేరు మార్పు, ఒక దేశం ఒకే ఎన్నిక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశం పూర్తికాగానే ఇండియా కూటమిలోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ కానున్నారు.
Read Also: Boy Died: పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి
Also Read
మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే ఇండియా పేరు మార్చే ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఎమర్జెన్సీ మీటింగ్ లు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, విపక్ష సభ్యులు కూటమి పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: Pa. Ranjith: సనాతన ధర్మంపై ఉదయనిధి మాటల్లో తప్పేం లేదు.. పా.రంజిత్ సంచలన ట్వీట్
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!