విశాఖలో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నుంచి రాజధాని కార్యకలాపాలను స్వాగతిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దసరా నుంచి పరిపాలన ప్రారంభిస్తున్న సీఎంకు మద్దతుగా నిలుద్దామని తెలిపారు. మరోవైపు టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ఖాజానాను టీడీపీ నాయకత్వం దోచేసిందని విమర్శించారు.
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు జీజీహెచ్ అధికారులు. కోవిడ్ కంట్రోల్ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అంతకంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 21 మందికి వెంటనే ట్రీట్మెంట్ అందించేలా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, మానిరింగ్ సిస్టం, 24 గంటలు ప్రత్యేక డాక్టర్లు, ఒక సూపర్వైజర్, ప్రత్యేక పరీక్షా విధానాల సదుపాయాలు కల్పించారు.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నామని తెలిపారు. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చిస్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని అన్నారు. మరోవైపు టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారని పేర్కొన్నారు.
సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారని మండిపడ్డారు.
కృష్ణా జిల్లా అయ్యంకిలో మరోసారి ఆస్తి తగాదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో భార్యాభర్తలను దారుణంగా హత్య చేశారు. పాత కక్షలు నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి అనే మహిళను నడిరోడ్డుపైన చంపేశారు. ఈమె భర్త వీరంకి వీర కృష్ణను పంచాయతీ ఆఫీస్ దగ్గర దారుణంగా హత్య చేశారు.
బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు.
ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్‌ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్‌పై నుంచి వచ్చి విద్యార్థినిపై పదునైన ఆయుధంతో దాడి చేసి…
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్‌ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు.