Ramachandra Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ దానికి అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అంతేకాకుండా.. సభలో మీసాలు మెలేయడం, తొడగొట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిపై ఆగ్రహంతో సభ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరమన్న స్పీకర్.. సభ ఔనత్యాన్ని తగ్గించేలా తొడలు కొట్టడం, మీసాలు మిలేయడం లాంటి చర్యలు సభలో చేయడం తప్పని అన్నారు. కానీ, సభలో తొడగొట్టడం, మీసాలు మిలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు.
Read Also: Minister Venugopal: సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు
టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు సభలో స్కిల్ డెవలప్ మెంట్ పైన చర్చిస్తున్నామని తెలిపారు. 26 న ఫైబర్ నెట్, 27 ఇన్నర్ రింగ్ రోడ్డు పై చర్చిస్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని అన్నారు. మరోవైపు టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి టీడీపీ నేతలు పారిపోతున్నారని పేర్కొన్నారు. సభలో ఈ రోజు బాలకృష్ణ చేసిన దానిపై రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ఆయన నిజమైన సైకోలా కనిపిస్తున్నాడని ఆరోపించారు.
Read Also: Krishna District: అయ్యంకిలో భగ్గుమన్న పాతకక్షలు.. భార్యాభర్తలు దారుణ హత్య