చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భిణీ స్త్రీలకు కానుక అందించారు. వారికి పోషకాహార కిట్ ను పంపిణీ చేశారు. దాంతో పాటు బేబీ షవర్ కిట్ ను ఇచ్చారు.
బీసీసీఐ.. 'X' (Twitter) ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో రజనీకాంత్‌కి జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గౌరవనీయులైన బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చి సత్కరించారు’ అని ఫోటోతో పాటు క్యాప్షన్ రాసింది.
రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్‌పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన చూపించడంతో ఆ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆసియా కప్ లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ చేరుకోలేదు. దీంతో ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు.