ముంబైలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించబడిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణనాథుడిని గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్‌బి) సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు.
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవాలని.. టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్‌కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను మొసలి నోటిలో పెట్టి దాన్ని లాలిస్తాడు.
వాషింగ్టన్ సుందర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై వాషింగ్టన్ సుందర్ 15.2 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు ఆసియా కప్ టైటిల్‌ను అందించాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్ బౌలింగ్ చేయొద్దని కోచ్ నుంచి సందేశం వచ్చిందని చెప్పాడు. సిరాజ్ 7వ వికెట్ పడగొట్టి ఉంటే.. భారత్ తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్టువర్ట్ బిన్నీ రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ఇచ్చిన సందేశంతో సిరాజ్ బౌలింగ్ చేయలేదు.