ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది.
చంద్రయాన్ 3పై ఇస్రో ఓ అప్ డేట్ ఇచ్చింది. మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందలేదని తెలిపింది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను ఇస్రో రేపటికి వాయిదా వేసింది.
యునైటెడ్ స్టేట్స్‌లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్‌లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు.
వన్డే వరల్డ్ కప్ వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం ఐసీసీ ప్రపంచకప్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 4 మిలియన్ US డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వనుంది. ఇండియా కరెన్సీలో ప్రపంచ కప్ ఛాంపియన్ జట్టుకు సుమారు రూ. 33 కోట్ల 17 లక్షలు రానున్నాయి. రన్నర్ కు దాదాపు రూ.16 కోట్ల 58 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది.
మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జేడీఎస్ నేత కుమారస్వామి హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.
రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
మనం రోజు తినే కూరల్లో ఉల్లిగడ్డను వేసి వండుకోవడం అది కామనే.. ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. నిజానికి ఉల్లిపాయ అనేది మన ఆహారపు అలవాట్ల నుంచి విడదీయరాని ఒక పోషకాలా నిధి. కానీ ఉల్లిగడ్డ కంటే దాని ఆకులు తినడం వల్ల కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మేలు చేస్తుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలన్నారు. దీనికి డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్నించారు. నేటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ మంచిదే అయినప్పటికీ.. అందులో రెండు లోపాలున్నాయని తెలిపారు.