ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. వారం రోజులపాటు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం ప్రారంభమైన నుండి వాడీవేడీగా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే.. టీడీపీ చంద్రబాబు అరెస్ట్ పై చర్చ కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ వాయిదా తీర్మానానికి అనుమతించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో స్పీకర్ సదరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Krishna District: అయ్యంకిలో భగ్గుమన్న పాతకక్షలు.. భార్యాభర్తలు దారుణ హత్య
ఈ వ్యవహారంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారని మండిపడ్డారు. ఇకపోతే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడని అన్నారు. చంద్రబాబు ప్రజాధనం ఏ విధంగా లూటీ చేశారో కోర్టుకు అందించామని.. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే జడ్జి రిమాండ్ విధించారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని అన్నారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.
Manchu Lakshmi: సైమా అవార్డుల్లో వ్యక్తిపై చేయి చేసుకున్న మంచు లక్ష్మి..
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారని మంత్రి వేణుగోపాల్ అన్నారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కల్యాణ్ ను తెచ్చుకున్నారని విమర్శించారు.
సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారని తెలిపారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నమని అన్నారు. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా.. తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదని.. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు.