విశాఖలో వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నుంచి రాజధాని కార్యకలాపాలను స్వాగతిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దసరా నుంచి పరిపాలన ప్రారంభిస్తున్న సీఎంకు మద్దతుగా నిలుద్దామని తెలిపారు. మరోవైపు టీడీపీపై ఆయన విరుచుకుపడ్డారు. 2014-19 మధ్య రాష్ట్ర ఖాజానాను టీడీపీ నాయకత్వం దోచేసిందని విమర్శించారు. ఒక్కో కేసు ఆధారాలతో సహా నిరూపణ అవుతున్నాయని.. చంద్రబాబు అరెస్టుకు గల కారణాలను గడపగడపకు తెలిసే విధంగా చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Read Also: Nipah Virus: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డు
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి దిక్కులేకే పవన్ కల్యాణ్‌పై ఆధారపడిందని అన్నారు. చంద్రబాబు అరెస్టైపై జైల్లో ఉన్నప్పటికీ ప్రజల నుంచి సానుభూతి కనిపించడం లేదని.. బయటి రాష్ట్రాల్లో మద్దతు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఇబ్బందుల్లో పడిందన్నారు. అందుకే ఆ పార్టీని నడిపేందుకు వేరే పార్టీ అధ్యక్షుడిపై ఆధారపడిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Ramachandra Reddy: టీడీపీ నేతలు రచ్చ కోసమే అసెంబ్లీకి వస్తున్నారు
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ రాజధాని లేకుండా చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.300 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. విశాఖను కేంద్రం కూడా గ్రోత్ హబ్ సెంటర్‌గా గుర్తించిందని చెప్పారు. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నుంచే ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు.