వన్డే ప్రపంచ కప్లో భాగంగా హైదరాబాద్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ సెంచరీ ప్రపంచ కప్కు ముందు ఎంతో బలాన్ని ఇచ్చింది.
ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. తాజాగా.. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 45 నుంచి 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో మరో పతకం ఖాయమైంది. జోర్డాన్ క్రీడాకారిణి హనన్ నాసర్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ జరీన్ ఏకపక్షంగా ఆడింది. ఈ విజయంతో నిఖత్.. 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల కోటాను దక్కించుకుంది.
మానవుని ఆరోగ్యం కోసం ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవసరం. ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, మనం పాటించే జీవనశైలిలో ఉంది. మంచి నిద్ర, ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వ్యాధులకు దూరంగా ఉండాలన్నా.. రోజంతా తాజాగా, ఉల్లాసంగా ఉండాలన్నా రోజూ 2-3 లీటర్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానవ జీవితంలో నీరు అమృతం లాంటిది. నీరు లేకపోవడం వల్ల ఆక్సిజన్, పోషకాహారం కణాలకు సరిగ్గా చేరవు. నీరు మానవ జీవితంలో జీవనాధారం వంటిది కానీ…
మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు.
నానబెట్టిన వేరుశెనగలు తినడం ద్వారా మానవుని ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన గింజలు, మొలకలు తింటారు. అవి తినడం వల్ల ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రోహిత్ శర్మ రికార్డులు చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌ల్లో 65.20 సగటుతో 987 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్‌పై 140 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు రోహిత్ శర్మ.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి జగన్ తో గౌతమ్ అదానీ సమావేశం కొనసాగుతుంది. విశాఖపట్నంలో డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.