ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. మరోవైపు ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అశ్విన్‌ను జట్టులో చేర్చారు. అందులో అతను బంతితో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అక్షర్ కు గాయం కావడంతో ఇప్పుడు అశ్విన్‌కు అవకాశంగా మారింది.
Uttar Pradesh: చిప్స్ ఆశ చూపి మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో అశ్విన్ 22 సగటుతో 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తో చాలా కాలం తర్వాత అశ్విన్ వన్డేలో పునరాగమనం చేశాడు. దీనికి ముందు.. అశ్విన్ తన చివరి ODI మ్యాచ్‌ను 2022 జనవరి 21న ఆడాడు. అయితే ఇప్పుడు అతను మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ జట్టులో భాగమయ్యాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 115 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.
Rahul Gandhi: కార్పెంటర్‌గా మారిన రాహుల్ గాంధీ..
మరోవైపు ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అక్షర్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు ముందే కోలుకుంటాడని ఊహాగానాలు వచ్చాయి.. కానీ అది జరగలేదు. దీంతో చివరి నిమిషంలో టీమిండియాలో మార్పు చేశారు. అశ్విన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాడు. ఇప్పటి వరకు 94 టెస్టులు, 115 వన్డేలు, 65 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అశ్విన్ టెస్టుల్లో 489, వన్డేల్లో 155, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ అద్భుతాలు చేసే సత్తా అశ్విన్‌కు ఉంది. టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో కూడా 1 అర్ధ సెంచరీ సాధించాడు.
Ujjain Case: ఉజ్జయిని మైనర్ రేప్ కేసు.. తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
ప్రపంచకప్‌కు భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.