వన్డే ప్రపంచ కప్లో భాగంగా హైదరాబాద్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ సెంచరీ ప్రపంచ కప్కు ముందు ఎంతో బలాన్ని ఇచ్చింది. తొలిసారిగా భారత్ కు వచ్చిన రిజ్వాన్కు.. ఈ సెంచరీ ప్రత్యేకమైనది. ఇంతకుముందు ఆసియా కప్లో విఫలమైన రిజ్వాన్.. ప్రపంచ కప్ ముందు ఇలాంటి ప్రదర్శన చేయడం జట్టుకు ఉపశమనం కలిగించే వార్త.
Fire Accident: ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రిజ్వాన్ క్రీజులో అడుగు పెట్టగానే పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫీక్ వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. దాని తర్వాత క్రీజులోకి వచ్చిన రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజామ్‌తో కలిసి నిలకడగా ఆడారు. వీరిద్దరు మూడవ వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎప్పటిలాగే రిజ్వాన్ మొదట సెటిల్ అయ్యేందుకు సమయం తీసుకున్నా.. ఆ తర్వాత తన స్వీప్ షాట్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Road Accident: ఏపీలో అన్న ప్రేమ కోసం తమ్ముడి బలి..
మరోవైపు కెప్టెన్ బాబర్ అజామ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 80 పరుగులతో మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌లకు అవకాశం కల్పించడానికి రిజ్వాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటింగ్ లో విఫలం అవుతుంది. ఫఖర్ జమాన్ ఎప్పటికీ నిరాచ పరుస్తుండటంతో.. అతని స్థానంలో అబ్దుల్లా షఫీక్‌ను ప్రయత్నించారు. అతను కూడా విఫలమయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ కూడా పెద్దగా రానించలేదు. అయితే పాకిస్తాన్ కు ఓపెనర్ల సమస్య.. ఇలాగే కొనసాగితే బాబర్, రిజ్వాన్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.