మరో వారం రోజుల్లో ఇండియాలో వరల్డ్ కప్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల జట్లు భారత్కు చేరుకోగా.. వార్మప్ మ్యాచ్లు నేటి నుంచి ప్రారంభించాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్కు ఇండియా ఆతిథ్యమిస్తుండటం విశేషం. అయితే ఈసారి జరగబోయే వన్డే వరల్డ్ కప్లో ఏఏ జట్లు సెమీ ఫైనల్ కు చేరుతాయనే చర్చ కూడా మొదలైంది. కొందరు క్రికెట్ దిగ్గజాలు సెమీస్ కు వెళ్లే టీమ్లను తెలిపారు. అయితే వారందరు ఎంచుకున్న దానిలో టీమిండియా ఉండటం విశేషం.
వన్డే ఫార్మాట్‌లో గత కొన్ని నెలలుగా భారత జట్టు బాగా ఆకట్టుకుంది. అటు ఆసియా కప్ 2023 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత.. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుంది కావున భారత్ కు అనూకూలిస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత జట్టు విజయం సాధిస్తుందని అంటున్నారు.
Soaked Peanuts: నానబెట్టిన వేరుశెనగలతో లాభాలెన్నో.. వీటితో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..!
10 మంది క్రికెట్ దిగ్గజాలు సెమీ-ఫైనల్‌కు ఏ జట్లు వెళ్తాయో చెప్పారు.
గౌతమ్ గంభీర్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
ఇర్ఫాన్ పఠాన్ – ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
ముత్తయ్య మురళీధరన్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
ఆరోన్ ఫించ్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
సంజయ్ మంజ్రేకర్- ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
క్రిస్ గేల్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్
రాబిన్ ఉతప్ప – ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్
సునీల్ గవాస్కర్ – ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
జాక్వెస్ కల్లిస్ – ఇండియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
షేన్ వాట్సన్ – ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్
Palla Rajeshwar Reddy: జనగామలో పల్లా వర్గమో, మరో వర్గమో లేదు, మనమంతా కేసీఆర్ వర్గం..
ఇకపోతే.. ఈ 10 మంది క్రికెట్ దిగ్గజాలలో ఐదుగురు మాత్రమే పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుతుందని తెలిపారు. ఇందులో షేన్ వాట్సన్, క్రిస్ గేల్, రాబిన్ ఉతప్ప, ముత్తయ్య మురళీధరన్, ఆరోన్ ఫించ్ పేర్లు ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పేర్లు ఎక్కడా కనిపించలేదు.