చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో.. భారత జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. దీంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి కేసులో బుద్గాం అదనపు పోలీసు సూపరింటెండెంట్ గౌహర్ అహ్మద్ ఖాన్, ఇటీవల అరెస్టయిన డీఎస్పీ ఆదిల్ ముస్తాక్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్‌లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పన్వెల్-వసాయి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ప్రాథమిక సమాచారం.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ టీమ్ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై చిత్ర నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రెండు జట్లలోని కొంతమంది ఆటగాళ్ళు, ఇతర వ్యక్తులు వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కొంతమంది బ్యాట్‌లతో దాడి కూడా చేసుకున్నారు.
బెంగాల్ నుండి 4వేల మంది MNREGA కార్మికులతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు రైలులో ఢిల్లీకి బయల్దేరారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్‌లో పలు విషయాలను వెల్లడించింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 2024 జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా.. శ్రీరామ నవమి వేడుకలను అయోధ్య రామ మందిరంలో నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరంలో ఉండే రాముడి విగ్రహాన్ని ఓ రహాస్య ప్రాంతంలో ముగ్గురు శిల్పులు చెక్కుతున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్‌లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్‌లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అభయ్‌సింగ్ పాకిస్థాన్‌కు చెందిన జమాన్ నూర్‌పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.