ప్రపంచ కప్కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమిండియా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరలో అక్షర్ పటేల్ స్థానంలో ఆర్.అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయం కావడంతో.. ఇంకా కోలుకోలేదు. దీంతో అశ్విన్ జట్టులో చేరాడు. అయితే అశ్విన్ టీమ్ లోకి రావడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్టు కోసం అశ్విన్ ఎంపిక చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్షర్ స్థానంలో అశ్విన్‌ని…
వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అక్కడ వర్షం పడుతుంది. ఆ కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని ఎంత కూల్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లిన అతని కోసం అభిమానులు ఎగపడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనిని చూసి 'మహీ భాయ్ ఐ లవ్ యూ' అంటూ గట్టిగా అరిచాడు. దీనికి ధోని చిన్న చిరునవ్వు నవ్వాడు.
తమిళనాడులోని చెన్నైలోని సైదాపేట ప్రాంతంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ పంపు పై కప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా.. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
బీహార్‌లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్‌పూర్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు.
ఆసియా క్రీడలలో భారత్ జోరు కొనసాగుతుంది. తాజాగా ఇండియా మరో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో కిరణ్ బలియన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 33వ పతకం.
మనం వండుకునే కూరగాయల వంటకాల్లో బే లీఫ్ తడ్కా జోడించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. బే ఆకులలో ఉండే మసాలా, తీపి కూరగాయలను రుచిగా చేస్తుంది. అంతేకాకుండా.. బే ఆకుల సువాసనతో కూరగాయలు కూడా సువాసనగా మారిపోతాయి. ఇక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.