భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగింది.
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ జట్టు అన్ని టీమ్లకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టించింది. మాతో జాగ్రత అని ఓ మెస్సేజ్ పంపింది. ప్రపంచ కప్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయామని.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ లో ఆడుతున్న ఆశావాధులకు వార్నింగ్ ఇచ్చింది.
రేపు( మంగళవారం) ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ భారత్ కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఆసియా క్రీడల్లో ఆడేందుకు భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
బీహార్‌లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది.
ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులకు దేశం ఆరు దశాబ్దాలు సమయం ఇచ్చింది. అప్పుడు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. అభివృద్ధిని పక్కన పెట్టి, పేదవాళ్ళ భావోద్వేగాలతో ఆడుకునేవారని విమర్శించారు.
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ ఒక సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తలకు బ్లూ స్కార్ఫ్ దరించారు. అనంతరం స్వచ్ఛంద సేవల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉపయోగించిన గిన్నెలను రాహుల్ శుభ్రపరిచారు.
ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ జాబితాలో జహీర్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను 23 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జావగల్ శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు.
శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.