2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు.
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు.
దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ళు కోసం టూత్‌పేస్ట్ను ఉపయోగిస్తారు. అయితే టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమని మీకు తెలుసా!.. కోల్‌గేట్, ఇతర ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ వస్తువులను వాడితే.. దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచకప్ 2023లో నిన్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరిగెత్తడం నుండి ఒత్తిడిలో మెరుగ్గా ఆడటం వరకు అనేక లక్షణాల గురించి తెలిపాడు. అంతేకాకుండా.. విరాట్ కోహ్లీ నుండి ఇవన్నీ నేర్చుకోవాలని భారత యువ క్రికెటర్లకు సలహా ఇచ్చాడు.
2023 వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
కర్నాటకలోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం దీనిని "తీవ్రమైన సంఘటన" అని పేర్కొంది. ఆదివారం ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు
ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో శనివారం జరిగిన హిందూ జాగృతి సమ్మేళన్‌లో బొమ్మై ప్రసంగిస్తూ.. గణపతి పండుగను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బైత్ గ్రామంలో ఓ యువకుడిని ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన తన స్నేహితుడు అనంతరం కాల్చిచంపాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ఇద్దరు స్నేహితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహ్మద్ అల్మాజ్(18)గా గుర్తించారు.