వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాపం పండిందని ఆరోపించారు. టెక్నికల్ నాలెడ్జ్ తో గతంలో 18 కేసుల్లో స్టే లు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని తెలిపారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ని ఇంటికి సాగనంపడం కాయమని మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జగన్ బురదను అందరికి అంటించాలని చూస్తున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా చంద్రబాబుని నిర్బంధించారని మండిపడ్డారు. లేని రింగ్ రోడ్డులో అవినీతి ఏంటి అని ప్రశ్నించారు.?
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు.
టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని ఆరోపించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉదయం నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి నారా లోకేష్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. లోకేశ్ పై ఈ కేసులో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చికూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు.
వన్డే ప్రపంచకప్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో అద్భుత డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు లాంగ్ ఆఫ్‌లో ఈ క్యాచ్ తీసుకున్నాడు.