ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో శనివారం జరిగిన హిందూ జాగృతి సమ్మేళన్‌లో బొమ్మై ప్రసంగిస్తూ.. గణపతి పండుగను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సనాతన ధర్మం గురించి
బొమ్మై కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఏం రాసి ఉందంటే.. ఈ ప్రపంచంలోని మొత్తం మానవ జాతి యొక్క సంక్షేమాన్ని ప్రచారం చేసే సనాతన ధర్మానికి చెందినవారము. పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ లాగా కాకుండా, అన్ని మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు.
Read Also: ఆల్ టైమ్ అత్యుత్తమ ఫుట్‌బాల్ టాప్ -10 ప్లేయర్లు వీళ్లే..!
బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. మన సనాతన ధర్మాన్ని మలేరియాతో పోలుస్తుంటే మౌనంగా ఉండాలా? సనాతన ధర్మం మన సిరల్లో ప్రవహిస్తోందన్నారు. ఎవరైనా తమ మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే మౌనంగా ఉండం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తల ఎత్తే శత్రు శక్తులేవీ లేవని పేర్కొన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు ప్రభుత్వ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక, తమిళనాడు మధ్య కొనసాగుతున్న కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గతంలో సూచించారు.
Read Also: Chandrababu: చంద్రబాబుకు రేపు అత్యంత కీలకం.. అన్ని కేసుల్లో తీర్పులు సోమవారమే..