ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు.
జనగామ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది. మినిస్టర్ క్లబ్ హౌస్ లో కాసేపట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఈనెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్‌ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడలేదు. కారణం అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఇక రేపు టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా శుభ్‌మన్ గిల్ ఆడటంలేదని బీసీసీఐ తెలిపింది.
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది.