ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కాంగ్రెస్ ఖండించింది. పాలస్తీనా ప్రజల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో విశ్వసిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.
భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జానారెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. దేశంలో తొమ్మిదేళ్లలో 112 లక్షల కోట్లు మోడీ ఖర్చు చేశాడని తెలిపారు. మోడీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై ఒకరు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదని జానారెడ్డి తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం…
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేటలో రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నారు. దేశం తెలంగాణా వైపు చూస్తుంటే... ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మంత్రి మహేందర్…
హైదరాబాద్ అంబర్ పేటలో సేవ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఇప్పటికే డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఆర్ట్స్ కాలేజీ చరిత్ర తెలిసేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ పెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ ను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు వైద్య సాయం అందించే…
టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమందు వరకు టీఎస్ ఆర్టీసీచైర్మన్గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. తాజాగా ఆయన స్థానంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రెండు సంవత్సరాల పాటు ముత్తిరెడ్డి కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నాం... కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దక్షత గల ఎండీ సజ్జనార్, ప్రిన్సిపల్ సెక్రటరీ…