Gautam Gambhir: ప్రపంచకప్ 2023లో నిన్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరిగెత్తడం నుండి ఒత్తిడిలో మెరుగ్గా ఆడటం వరకు అనేక లక్షణాల గురించి తెలిపాడు. అంతేకాకుండా.. విరాట్ కోహ్లీ నుండి ఇవన్నీ నేర్చుకోవాలని భారత యువ క్రికెటర్లకు సలహా ఇచ్చాడు.
Read Also: Chandrababu Case: చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. మైదానం వెలుపల కూడా గౌతమ్ గంభీర్ చాలాసార్లు విరాట్ కోహ్లీని టార్గెట్ చేశాడు. అయితే ఇప్పుడు కింగ్ కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించాడు. క్రీజులో ఉన్నప్పుడు ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసంటూ.. చెప్పాడు. అంతేకాకుండా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కోహ్లీకి బాగా తెలుసన్నాడు. క్రీజులో పెద్ద షాట్టు కొట్టడమే కాదు.. వికెట్ల మధ్య పరుగులు కూడా ముఖ్యమని చెప్పాడు.
Read Also: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
అయితే నిన్న ఆడిన కోహ్లీ ఆటతీరు, ఫిట్ నెస్ గురించి యువ క్రికెటర్లు నేర్చుకోవాలని గంభీర్ అన్నాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. తక్కువగా ప్రమాదకర ఆడాలని.. టెన్షన్ తో అడపాదడపా ఆడొద్దని తెలిపాడు. ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుసుకోవాలని యువ క్రికెటర్లకు సూచించాడు. స్ట్రైక్‌ని నిరంతరం మార్చడానికి ప్రయత్నించాలని చెప్పాడు. కోహ్లీ చేసింది అదేనని.. అందుకే ఆస్ట్రేలియాతో విజయం సాధించామని గంభీర్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ నుంచి యువ క్రికెటర్లు ఇవన్నీ నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు గంభీర్ అన్నాడు.