ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అందులో టీమిండియా ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. ప్రపంచ కప్ 2023లో భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ మూడింటిలో విజయం సాధించింది. అందుకు కారణం బౌలింగ్, బ్యాటింగ్ నుంచి మంచి ప్రదర్శన కనపరచడం. తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో దంచికొట్టాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందుకు ఎగబాకాడు. ఇక టీమిండియాలో మరో యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ కూడా.. తన స్థానాన్ని పదిలంగా…
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
కారంకే ఘాటు తెప్పించే మరో కొత్త రకం ఒక మిరపకాయ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారంతో కలిగి ఉంటుందట. పెప్పర్ ఎక్స్ పేరుతో ఇదొక వింత ఆకారాన్ని కలిగి ఉంది. ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించారు. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీం సౌతాఫ్రికాపై గెలుపొందారు. మొదట వర్షం కారణంగా ఇరు జట్లకు 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 245/8 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులు చేసి ఆలౌటైంది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోకియా 16GB RAM 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Nokia G42 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే నోకియా.కామ్, ఇ-కామర్స్ సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. మొన్న ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిని ఇంకా దిగమింగుకోక ముందే.. ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టులో కొందరు ఆటగాళ్లు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి ప్లేయర్లు ఉన్నారు.
కొలెస్ట్రాల్ స్థాయిలు అన్ని వయసుల వారికి సర్వసాధారణంగా మారాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అదనపు కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం వలన గుండె జబ్బులు, గుండెపోటులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. అవి పాటించినట్లైతే కొలెస్ట్రాల్…