నిన్న జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆసీస్ జట్టు తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగగా.. తమ జట్టు గెలుపొందడంపై తీవ్ర ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఓ ఆస్ట్రేలియా అభిమాని. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గణపతి బప్పా మోరియా అంటూ స్టాండ్ లో గట్టిగా నినాదాలు చేశాడు. అయితే ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలిని వేధిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు మైనర్ బాలుడు. మృతుడు భాటి మైన్స్ ప్రాంతానికి చెందిన గంగారాం అలియాస్ సంజయ్‌గా గుర్తించారు.
స్మార్ట్‌ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు.
పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మంగళవారం ఉదయం మృతిచెందింది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
ధర్మశాలలో వర్షం కారణంగా నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం అయింది. అంతకుముందు వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొంతసేపు విరామం ఇవ్వడంతో టాస్ వేశారు. అందులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగే సమయానికే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆట మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్‌లో చాలా మంది స్టార్ ఇండియన్ క్రికెటర్లు పాల్గొనలేరు. 2028 నాటికి.. చాలా మంది ఇండియా ఆటగాళ్ల వయస్సు రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత స్టార్ ఆటగాళ్లు ఆడటం చాలా కష్టం. ప్రస్తుతం.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 సంవత్సరాలు ఉండగా.. 2028 ఒలింపిక్స్ నాటికి అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు చాలా తక్కువ.
వరల్డ్ కప్ 2023లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన ఖాతాను తెరిచింది. ఈరోజు లక్నోలో జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లో మూడు ఓడిపోయింది.
పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య మ్యాచ్ ఈ రోజు లక్నోలో జరుగుతుంది. అయితే మ్యాచ్ మధ్యలో భారీ వర్షం, తుపాన్ వచ్చింది. దీంతో గాలిదుమారానికి స్టేడియంలోని ఓ భారీ బోర్డు ఊడి ప్రేక్షకులు కూర్చునే సీట్ల మధ్య పడిపోయింది. అయితే అది ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.