ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే అందరికి అభిమానమే. తన అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాకుండా.. తన హెల్పింగ్ నేచర్ తో కూడా అభిమానులను అలరిస్తాడు. అయితే తాజాగా.. ఈసారి ఏకంగా అభిమానుల మనసులనే గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మధ్యలో వర్షం పడింది. ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసుకుని స్టేడియంలోకి వస్తుంటే వారికి డేవిడ్ వార్నర్ సహాయం చేశాడు. దీనిపై అభిమానులు డేవిడ్ భాయ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు కళ్లను ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఇతర గాడ్జెట్‌ల కారణంగా కంటి చూపు దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో పోషకాలు ఉండే పదార్థాలు తినడం మంచిది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవానికి పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసాడు. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీలో ఫిర్యాదు దాఖలైంది. మహ్మద్ రిజ్వాన్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో తమ జట్టును అన్ని రకాలుగా చిత్తు చేసిందని తెలిపాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిందని కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా.. టీమిండియా ముందు పాకిస్తాన్ జట్టు ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని విమర్శలు చేశాడు.
ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ భారీ ఓటమి తర్వాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ప్రపంచ కప్ 2023లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందని చెప్పాడు.
అబ్బాయిల వల్ల కానీ పనిని అమ్మాయిలు చేశారు. దాంతో ప్రపంచ రికార్డు సృష్టించారు. బ్యూనోస్ ఎయిర్స్ నగరంలో చిలీతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల క్రికెట్ జట్టు టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 427 అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అర్జెంటీనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
సూర్య డగౌట్ లో కూర్చుని ఏదో తింటున్న వీడియో సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ కామెంట్ చేశాడు. “సార్, మీరు డగౌట్‌లో కూర్చుని ఏమి తింటున్నారు, గ్రౌండ్‌కి వెళ్లి సిక్స్‌లు కొట్టండి” అని రాశాడు. అయితే దానికి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నేనేమీ తింటే మీకేందుకు.. మీకు కావాలంటే దయచేసి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వండి బ్రదర్” అని రాశాడు
ఉద్యోగం లేఖ ఖాళీగా ఉన్నారా.. సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సీనియర్లకు కాకుండా.. ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతుంది. టీసీఎస్ సీవోవో ఎన్. గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ పేర్కొంది.
2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌తో పాటు, బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా నిర్వహించనున్నారు. గత శుక్రవారమే ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడాంశాల ప్రవేశానికి సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి.. ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్ 2028లో చేర్చాలనే లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్…
నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా 'ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు మద్దతు ఇచ్చినందుకు, ఆట జరిగినంత సేపు…