ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన చూపించింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో టీమిండియా రికార్డుల పరంగా చూసుకుంటే అంత మెరుగ్గా లేవు. 2015 ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై, 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి కూడా తొలి సెమీ ఫైనల్ లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది.
Read Also: Rahul Dravid: వరల్డ్కప్లో టీమిండియా విజయ రహస్యాలు చెప్పిన ద్రవిడ్
ఇలాంటి క్రమంలో టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా ఏం చేయాలి అనే ప్రశ్న టీమిండియా అభిమానులందరిలో మెదులుతోంది. అయితే.. ఈ ప్రశ్నపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఓ సలహా ఇచ్చాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో పరుగులను ఛేజ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని తన వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ ఆలౌట్ అవుతుందని చెప్పాడు. వాంఖడేలో మంచు కురిసిన తర్వాత పరుగులను ఛేజింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే, కానీ టీమిండియా ఇంతకుముందు ఆ పని చేసింది అని అన్నాడు.
Read Also: Kareena Kapoor Khan: దేవర విలన్ భార్య డర్టీ ఫోజులు.. మరీ చాప మీద..
అయితే.. సెమీ-ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో టాస్ ప్రత్యేక పాత్ర పోషించదని ఆకాష్ చోప్రా కూడా అభిప్రాయపడ్డాడు. టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతున్నారు కావున.. న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఓడించగలరని భావిస్తున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి, ఆ తర్వాత పరుగులు కట్టడి చేసి వికెట్లను పడగొట్టారు. దీంతో ఆ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కు వెళ్లబోతున్నామని ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.