Kane Williamson: వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిసినప్పటికీ.. రేపు, ఎల్లుండి సెమీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో రేపు (బుధవారం) తొలి సెమీస్ పోరు జరుగనుంది. ఈ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రేపటి సెమీస్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో మ్యాచ్ ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నామని అన్నాడు. టీమిండియా పెద్ద జట్లలో ఒకటని కానీ.. అందరికంటే అత్యుత్తమ జట్టు అనలేమని తెలిపాడు.
Read Also: Team India: టీమిండియా టాస్ గెలిస్తే ఏం చేయాలి..? మాజీ క్రికెటర్ సలహా
ఇదిలా ఉంటే.. రేపు జరిగే మ్యాచ్ కోసం వాంఖడే స్టేడియం టీమిండియా అభిమానులతో నిండిపోతుందని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇంతకుముందు.. ఇలా భారీగా ప్రేక్షకులు ఉన్న మ్యాచ్ లు ఆడిన అనుభవం తమకు ఉందని తెలిపాడు. ఇలాంటి స్టేడియాల్లో ఆడే అవకాశం రావడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. ప్రేక్షకులు తమకు సపోర్ట్ చేయకపోయినా.. అద్భుతంగా రాణించిన సందర్భాలు ఉన్నట్లు తెలిపాడు. ఏదేమైనప్పటికీ.. టీమిండియాతో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.
Read Also: Bandla Ganesh : అయ్యప్ప మాలలో బండ్లన్న అపచారం.. ఆడుకుంటున్న నెటిజన్లు..