మహదేవ్ బెట్టింగ్ యాప్ ఉచ్చులోకి మొదట బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆ తర్వాత రాజకీయ నాయకుల పేర్లు వచ్చాయి. కానీ ఈ ఉచ్చు మరింత బిగుస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అనే పేరు నుంచి ఇప్పుడు వ్యాపార ప్రపంచానికి చేరుకుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో (FMCG) రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన డాబర్ గ్రూప్‌లోని ఉన్నతాధికారులు దీని ట్రాప్లో పడిపోయారు. దీంతో వారిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు 32 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో డాబర్ గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్, చైర్మన్ మోహిత్ బర్మన్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై మోసం, జూదం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Earthquake: శ్రీలంకను వణికించిన శక్తవంతమైన భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఈ కేసులో ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మోహిత్ బర్మన్ 16వ నిందితుడిగా, గౌరవ్ బర్మన్ 18వ నిందితుడిగా ఉన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 31 మంది పేర్లను నమోదు చేయగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తిని కూడా నిందితుడిగా చేర్చారు. సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నవంబర్ 7న ఈ కేసు నమోదు చేశారు. ‘స్టైల్’ సినిమాతో ఫేమస్ అయిన సాహిల్ ఖాన్.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో 26వ స్థానంలో ఉన్నాడు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మరో యాప్‌ను సాహిల్ ఖాన్ నడుపుతున్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో సాహిల్ ఖాన్ ఈ యాప్‌ను ప్రమోట్ చేశాడని మాత్రమే కాకుండా.. యాప్ ఆపరేషన్‌లో పాల్గొన్నాడని, దాని నుండి లాభం పొందాడని కూడా ఆరోపించారు.
Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. సాహిల్ ఖాన్ వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. అందులో అతను దుబాయ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ పార్టీకి హాజరవుతున్నట్లు ఉంది. అంతేకాకుండా.. ఆ యాప్‌కు సంబంధించి ‘ఖిలాడీ’ యాప్‌ను నడుపుతున్నట్లు సాహిల్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. ఈ యాప్ ద్వారా ప్రజలను రూ.15,000 కోట్ల మోసం చేశారని సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 420, 465, 467, 468, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.