తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో.. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయనుంది.
రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం.. మా బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎవరూ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణం చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ.. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని అన్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఎవరు దోస్త్, ఎవరు దుస్మన్ అర్థం…
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే.. మొదటి వారం రోజుల…
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్ గా నియమిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనన్నారు. అక్బరుద్దీన్ ను ప్రొటెమ్ స్పీకర్ గా నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.
మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తన పేరుతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాచకొండ కమిషనర్ కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ తెలిపారు. వారం రోజుల్లో మీ అంతు చూస్తామంటూ…
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అంతర్…
ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు.
ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ ప్రణాళికలు సిద్దం చేస్తోందని తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఫెడ్లర్లను అరెస్టు చేశారు. ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో కోటి ఇరువై ఎనిమిది లక్షల విలువైన 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.