రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
మంత్రివర్గంలో సమర్ధుడైన వ్యక్తి కావడం వల్లనే భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్య కూడా చాలా క్లిష్టమైనది.. ఈ రెండు కష్టమైన కిరీటాలు భట్టికి అప్పగించారని తుమ్మల తెలిపారు. భట్టి విక్రమార్క పనితీరును వల్లనే ఆయనకి ఆ పదవులు ఇచ్చారని.. ఆయన అద్భుతంగా ఆ పదవిని నిర్వహిస్తారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎటువంటి అక్రమాలు లేకుండా కబ్జాలు లేకుండా చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు విక్రమార్క, పొంగులేటి సహకారంతో సీతారామ…
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని సంబంధించి వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదని ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ ఎంఐఎంని ప్రొటెం స్పీకర్ చేసిందని విమర్శలు చేశారు. అందుకే బీజేపీ ప్రొటెం స్పీకర్ ఎంపికను వ్యతిరేకించిందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎవరిపేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని.. విచ్ఛిన్నకర రాజకీయాలకు కేరాఫ్ గా కాంగ్రెస్…
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు.
సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే.హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్.రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి మంత్రికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద సృష్టించడం, సృష్టించిన…
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయమైనట్లు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే ఫైల్స్ మిస్సింగ్ పై ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖలోని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాగా.. ఫైల్స్ నిన్ననే మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యాచరణ మొదలైంది.. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం.. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ పై మహిళలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. పటాన్ చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ లో మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు జగ్గారెడ్డి. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. టికెట్ లేని ప్రయాణం అంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
శాఖల కేటాయింపు తర్వాత సచివాలయానికి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈ క్రమంలో.. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. ఆర్థిక శాఖ కార్యాలయంలో సంబంధిత…
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 13 బీసీ సంఘాలు అభినందించాయి. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తున్న తీరు.. ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్నికల తీరు చాలా గొప్పగా ఉందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడంతో.. నిరుద్యోగులు, బి.సి సంఘాలు పోరాటం చేసి ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రిపై బీసీలు…