ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే.. మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు. ఈ మార్గదర్శకాలు.. రేపటి నుంచి అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి.. రేపు అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకంపై.. డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలని.. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి బస్సులో ఎక్కిన మహిళా ప్రయాణికుల సంఖ్యను కూడా కండక్టర్లు విధిగా వివరాలు రాసుకోవాలని పేర్కొన్నారు.
Big Breaking: ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకం అమలులోకి రానుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్.. సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. రేపు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం పరిధిలోకి 7200 బస్సులు రానున్నాయని సజ్జనార్ చెప్పారు. మరోవైపు.. రాబోయే రోజుల్లో 3వేల కోట్ల భారం పడనుందని తెలిపారు. కాగా.. రేపటి నుంచి వారం రోజుల వరకు టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చని.. వారం రోజుల్లో జీరో టికెట్ ఇష్యూ చేస్తామన్నారు.
Raja Singh: అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్ గా నియమిస్తే.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను
అందుకు సంబంధించి.. ఇప్పటికే అన్ని రీజనల్ సెంటర్స్ లో అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహనా కల్పించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్ణాటకకు తెలంగాణ ఆర్టీసీకి పోలిక లేదు… అక్కడి పరిస్థితులు వేరు.. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులూ రాకుండా జాగ్రత్త వహించడానికి తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. రాబోయే రోజుల్లో కొత్త బస్సులను తీసుకొస్తున్నామని.. వాటికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి మహిళా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.