బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్ గా నియమిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనన్నారు. అక్బరుద్దీన్ ను ప్రొటెమ్ స్పీకర్ గా నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే.. 2018లోనూ రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యవహరించినప్పుడు ఇలాగే ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చాకే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు.
Read Also: TSRTC: పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ప్రయాణం ఉచితం
కాగా.. అక్బరుద్దీన్ నను తెలంగాణ అసెంబ్లీకి మధ్యాహ్నం ప్రొటెమ్ స్పీకర్ గా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.